వందే భారత్ ట్రైన్ టికెట్ల రేట్ల వివరాలు

వందే భారత్ ట్రైన్  టికెట్ల రేట్ల వివరాలు

వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల్లో నడవనుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును రేపు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ రైళ్లలో టికెట్ల రేట్లు ఎలా ఉంటాయన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

 వందే భారత్ రైలు టికెట్ రేట్ల వివరాలు

  • సికింద్రాబాద్ టు వరంగల్ : రూ.520
  • సికింద్రాబాద్ టు ఖమ్మం ; రూ.750
  • సికింద్రాబాద్ టు విజయవాడ : రూ. 905
  • సికింద్రాబాద్ టు రాజమండ్రి ; రూ.1365
  • సికింద్రాబాద్ టు విశాఖపట్నం : రూ.1665

ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజుల ముందుగానే అందుబాటులోకి వస్తోంది. వందే భారత్‌లో ప్రయాణికులకు కేటరింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసురానున్నట్టు సమాచారం. ఇందుకోసం ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సదుపాయం ఐచ్ఛికం మాత్రమేనని, ప్రయాణికులు ఒకవేళ ఆహారం వద్దనుకుంటే కేటరింగ్‌ ఛార్జీలు ఉండవని విశ్వసనీయ వర్గాల సమాచారం.