ఎల్లమ్మ తల్లికి ఆరోపూజ.. కిక్కిరిసిన గోల్కొండ

ఎల్లమ్మ తల్లికి ఆరోపూజ..  కిక్కిరిసిన గోల్కొండ

మెహిదీపట్నం, వెలుగు:  గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లికి ఆరో పూజ ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి భారీ సంఖ్యలో భక్తులు బోనాలను సమర్పించారు. ఆదివారం కావడంతో సుమారు రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఈవో వసంత తెలిపారు. 

 చిమ్మ చీకట్లో మెట్లు దిగిన భక్తులు 

కోటలో రాత్రి పురావస్తు శాఖ విద్యుత్​ను నిలిపివేసింది. ఈ క్రమంలో కోటలో విద్యుత్ లేకపోవడంతో భక్తులు బిక్కుబిక్కుమంటూ చీకట్లో మెట్లు దిగారు. అయితే పురావస్తు శాఖ అధికారులను భక్తులు నిలదీయడంతో మళ్లీ విద్యుత్తును పునరుద్ధరించారు. దీంతో సంబంధిత అధికారులపై భక్తులు ఫైరయ్యారు.