
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ వర్సిటీ ప్రాంగణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. డప్పుల వాయిద్యాలు, పోతరాజుల డాన్స్‌లు, విన్యాసాలతో బోనాల జాతర ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆలయ కమిటీ సభ్యులు దామోదర్‌రెడ్డి, శంకర్‌యాదవ్, రవికుమార్‌గౌడ్, భాస్కర్, బాలరాజు, మాధవరెడ్డి, వెంకటేశ్, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.