అన్ని స్కూళ్లలో వందేమాతరం పాడాల్సిందే: సీఎం యోగి

అన్ని స్కూళ్లలో వందేమాతరం పాడాల్సిందే: సీఎం యోగి

గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్‎లోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతరం పాడడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. సోమవారం గోరఖ్ పూర్‎లో నిర్వహించిన ‘ఏక్తాయాత్ర’లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఈ విషయం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో వందేమాతరం పాడడాన్ని తప్పనిసరి చేస్తే, భరతమాత మీద పౌరుల్లో గౌరవం పెరుగుతుందన్నారు.

‘‘స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ ప్రజలను వందేమాతరం మేల్కొల్పింది. ప్రతి విప్లవకారుడు, యువత, మహిళలు, పిల్లలు ఇలా అందరూ వందేమాతర నినాదంతో స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలాంటి జాతీయ గీతంపై అందరికీ గౌరవం ఉండాలి. అందుకే రాష్ట్రంలోని ప్రతి స్కూల్‎తో పాటు అన్ని విద్యా సంస్థల్లోనూ వందేమాతరం పాడడాన్ని తప్పనిసరి చేయబోతున్నాం” అని యోగి తెలిపారు.