వందే సాధారణ్.. ట్రయల్ రన్ సక్సెస్

వందే సాధారణ్.. ట్రయల్ రన్ సక్సెస్
  • 130 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించిన రైలు

ముంబై :  ఇండియన్ రైల్వేస్ వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ను  విజయవంతంగా పూర్తి చేసింది. ముంబై, అహ్మదాబాద్ మధ్య బుధవారం ఈ ట్రయల్ రన్ జరిపారు. ట్రయర్ రన్ లో ఈ రైలు గంటకు 130 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ముంబై– న్యూ ఢిల్లీ, పాట్నా– న్యూ ఢిల్లీ, హౌరా– న్యూ ఢిల్లీ, హైదరాబాద్– న్యూ ఢిల్లీ, ఎర్నాకులం– గౌహతి మధ్య ఈ రైలును అందుబాటులోకి తీసుకు రానున్నారు.

స్పెషాలిటీస్ ఇవే..

 వందే భారత్ కు నాన్ ఏసీ వెర్షన్ గా దీనిని తీసుకొచ్చారు. వందే భారత్ లో పూర్తిగా ఏసీ కోచ్ లు ఉంటే  వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ను పూర్తిగా నాన్ ఏసీ కోచ్ లతో డిజైన్ చేశారు. దీంతో ప్రయాణీకులకు మరింత  చౌక ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.  వందే సాధారణ్ లో 22 కోచ్ లు ఉంటాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కేటగిరీల్లో 1800 మంది ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత రీత్యా సీసీటీవీతో పాటు సెన్సర్ ఆధారితమైన టెక్నాలజీ వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్  లో ఉంటుంది.