వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘శబరి’

వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ‘శబరి’

వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  తెరకెక్కుతోన్న చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో  మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మూడో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిచేసుకుంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అరకు లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్ చేశారు. ముఖ్య నటులపై కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీక్వెన్సులు, ఒక పాట షూట్ చేశారు.  

నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయని చెబుతోంది మూవీటీమ్. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు. నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి శబరి పాత్రను చేస్తే బాగుంటుందని భావించి వరలక్ష్మిని తీసుకున్నాం. ఇందులో ఆమె స్వతంత్ర భావాలున్న యువతిగా కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా ఎఫెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెర్ఫార్మ్ చేశారు’ అని  చెప్పాడు.