వరలక్ష్మి శరత్ కుమార్ ‘ఛేజింగ్’ మూవీ డబ్బింగ్ పూర్తి

వరలక్ష్మి శరత్ కుమార్ ‘ఛేజింగ్’ మూవీ డబ్బింగ్ పూర్తి

సీనియర్ హీరో ‘శరత్ కుమార్’ కుమార్తె ‘వరలక్ష్మి శరత్ కుమార్’ లేడీ ఓరియంట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. విలన్, క్యారెక్టర్ పాత్రలను పోషించి అటు తమిళం, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రాన్ని  ‘ఛేజింగ్’ పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు.

శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం సినిమాలను ఈ బ్యానర్ రూపొందించింది. ఏఎన్ బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తమిళంలో విజయం సాధించినట్లుగానే ఈ మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.