హరహర మహాదేవ: శివుడి ఆకారపు స్టేడియానికి.. క్రికెట్ దిగ్గజాల రాక

హరహర మహాదేవ: శివుడి ఆకారపు స్టేడియానికి.. క్రికెట్ దిగ్గజాల రాక

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారీ స్టేడియం నిర్మితం కాబోతుందన్న తెలిసిందే. దాదాపు 450 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. బీసీసీఐ,ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ స్టేడియాన్ని సంయుక్తంగా కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ స్టేడియానికి ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

శంకు స్థాపనకు భారత క్రికెట్ దిగ్గజాలు
 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు నేడు ముహూర్తం ఖరారైంది. ఈ శంకుస్థాపన కోసం టీమిండియా లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్,దిలీప్ వెంగ్‌సర్కార్ శనివారం వారణాసి క్రికెట్ స్టేడియంకు వెళ్లారు.

ALSO READ : మళ్లీ మళ్లీ రద్దు అయిన గ్రూప్ 1

ఈ రోజు జరగనున్నశంకుస్థాపనకు వీరు ప్రత్యేక అతిధులుగా హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఈ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్నారు.

భారీ వ్యవంతో.. శివతత్వం ఉట్టిపడేలా స్టేడియం 
  
కాగా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ కోసం 121 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బీసీసీఐ రూ.330 కోట్లు వెచ్చించనుంది. అచ్చం శివుడిని తలపించేలా ఈ స్టేడియం ఉండబోతుంది. త్రిశూలాన్ని పోలిన  ఫ్లడ్ లైట్లు, గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ప్రేక్షకులు గ్యాలరీ ఉండనుంది. సుమారు 30 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో  ఈ స్టేడియం నిర్మితం కానుంది. మొత్తానికి  పూర్తిగా శివతత్వం ఉట్టిపడేలా రూపు దిద్దుకుంటున్న ఈ స్టేడియం పూర్తయ్యేసరికి ఎలా ఉంటుందో చూడాలి.