సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ' వారణాసి' . దాదాపు రూ. 1300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలతో భారీగానే ఉన్నాయి. భారతీయ పురాణాల నేపథ్యంలో సాగే ఈ సాహసగాథను విజువల్ వండర్ గా తెరపై ఆవిష్కరించేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హాలీవుడ్ నిపుణులతో ఈ సినిమాలోని సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రేక్షకులను అబ్బురపరించేలా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు..
పారిస్‌లోని ప్రఖ్యాత 'లే గ్రాండ్ రెక్స్' (Le Grand Rex) థియేటర్‌లో జనవరి 5, 2026న ఈ ' వారణాసి' సినిమా టైటిల్ టీజర్‌ను ప్రదర్శించారు. అక్కడ టీజర్ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమాగా 'వారణాసి' చరిత్రకెక్కింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఈ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో ఇక్కడ రజనీకాంత్ 'కబాలి', ప్రభాస్ 'బహుబలి2' , 'సహో' చిత్రాలను ఈ థీయేటర్ లో ప్రదర్శించారు . కానీ విడుదలకు ముందే భారీ స్థాయిలో గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ జరగడం మాత్రం ఇదే తొలిసారి.
Premières images du très attendu film de S. S. Rajamouli, #Varanasi, qui arrivera sur grand écran en 2027. #FestivalDeLaBandeAnnonce pic.twitter.com/ZIdRHBpfyn
— Le Grand Rex (@LeGrandRex) January 5, 2026
పవర్ ఫుల్ పాత్రలో మహేష్ బాబు.
ఈ ప్రతిష్టాత్మక మూవీలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ఆయన నంది మీద కూర్చోని, చేతిలో త్రిశూలం పట్టుకున్న వస్తున్న దృశ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాత్ర కోసం మహేష్ బాబు ప్రాచీన యుద్ధ కళ 'కలరిపయట్టు' లో కూడా శిక్షణ పొందారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన శ్రీరాముడిగానూ కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇందులో 'మందాకిని' అనే నిగూఢమైన పాత్రను పోషిస్తుంది., మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.
రిలీజ్ డేట్ ఖరారు?
ఈ సినిమాను 1.43:1 ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ టెక్నాలజీతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో 2027 వేసవిలో సినిమా వస్తుందని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ పురాణాల స్ఫూర్తితో, అంతర్జాతీయ స్థాయి సాహసగాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
