ఆర్మీ జవాన్ల కోసం ఐరన్ మ్యాన్ సూట్

ఆర్మీ జవాన్ల కోసం ఐరన్ మ్యాన్ సూట్

ఆర్మీ జవాన్ల కోసం ఐరన్ మ్యాన్ సూట్ ను తయారు చేశాడు ఓ వ్యక్తి. ఇది ఎనౌ కౌంటర్, యుద్ధాలలో పాల్గొనే జవాన్ల ప్రాణాలను రక్షిస్తుందని తెలిపారు. వారణాసిలోని అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ లో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్న శ్యామ్ చౌరాసియా అనే వ్యక్తి ఈ ఐరన్ మ్యాన్ సూట్ ను తయారు చేశాడు. దీన్ని తయారు చేయడానికి జుగాడ్ టెక్నాలజీని వాడానని తెలిపారు.

సూట్ కు గేర్స్, మెషిన్, మొబైల్ కనెక్షన్ అమర్చినట్టు తెలిపారు. వీటిని రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. వెనక నుంచి దాడి చేసేవాళ్లను గమనించి జవాన్లకు కమాండ్ ఇచ్చే సెన్సార్ వ్యవస్థ ఇందులో ఉందని తెలిపారు. అయితే దీన్ని మరింత డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.