తెలుగు, తమిళ బైలింగ్విల్‌‌‌‌ మూవీగా ‘వారసుడు’

తెలుగు, తమిళ బైలింగ్విల్‌‌‌‌ మూవీగా ‘వారసుడు’

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీపైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘వారసుడు’. తెలుగు, తమిళ బైలింగ్విల్‌‌‌‌ మూవీగా దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. శరత్‌‌‌‌కుమార్, ప్రభు, ప్రకాష్  రాజ్, జయసుధ, సంగీత ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే రెండు నెలల ముందునుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్.

నిన్న ఈ మూవీ నుంచి తమిళ వెర్షన్ ఫస్ట్ సాంగ్‌‌‌‌ను విడుదల చేశారు. దీంతో పాటు స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను కూడా వదిలారు. ఇందులో విజయ్‌‌‌‌, రష్మిక రొమాంటిక్ లుక్‌‌‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు.  ‘రంజితమే’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. తమన్ కంపోజ్ చేయగా, వివేక్ లిరిక్స్ రాశాడు. ఎమ్‌‌‌‌.ఎమ్‌‌‌‌ మానసితో కలిసి విజయ్ పాడటం స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌‌‌‌గా ఉన్నాయి.  రష్మిక స్టన్నింగ్ లుక్‌‌‌‌లో కనిపిస్తోంది. సెట్టింగ్, బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లతో పాటు వీరిద్దరి కాంబో కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంది. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు.