వర్ధన్నపేట, వెలుగు: సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల స్క్రూటినీ పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం వరంగల్‌జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, నల్లబెల్లి, ల్యాబర్తి గ్రామాల్లోని రిటర్నింగ్అధికారులు నిర్వహిస్తున్న స్క్రూటినీ కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు.
వర్ధన్నపేట మండలంలో మొదటి విడత ఎన్నికల నామినేషన్ల18 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లుగా 129 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం స్క్రూటినీ తర్వాత 108 అప్లికేషన్లు ఆమోదించారు. 21 మందిని వివిధ కారణలతో తిరస్కరించారు. 170 వార్డులకు 397 నామినేషన్లు రాగా 386 వార్డు మెంబర్ల నామినేషన్లను అమోదించారు. 11నామినేషన్లను వివిధ కారణలతో తిరస్కరించినట్లు ఆఫీసర్లు తెలిపారు.
నామినేషన్ కేంద్రాల తనిఖీ
నల్లబెల్లి: రెండో విడత నామినేషన్స్ కేంద్రాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. వరంగల్‌జిల్లాలోని నల్లబెల్లి, మండలం నారక్కపేట, రుద్రగూడెం, దుగ్గొండి మండలంలోని వెంకటపూర్, శివాజీనగర్గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లవివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిషనర్ బి. బాల మాయాదేవి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, కృష్ణ, అరుంధతి పాల్గొన్నారు.
