
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మట్కా’. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. ఇటీవల మొదటి పాటతో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే సెకండ్ సాంగ్ అక్టోబర్ 24న రాబోతోందని రివీల్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ రెట్రో అవతార్‌లో ఇంప్రెస్ చేశాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, సలోని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.