ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండే ప్రేమకథ

ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండే ప్రేమకథ

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఇలా ముచ్చటించారు. 

పద్దెనిమిదేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చి... తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ లాంటి దర్శకుల దగ్గర వర్క్ చేశాను. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నా చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే కథలు రాసుకుంటాను. రియల్ లైఫ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఈ సినిమా కాన్సెప్ట్ రాశాను. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. నాగచైతన్యకి కూడా ఈ కథ చెప్పాను. కానీ కొత్త దర్శకులతో చేసిన ప్రతిసారి ఆయనకి కలిసి రాలేదు. అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని నేనే డ్రాప్ అయ్యాను. సినిమాకు సంబంధించి కథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. క్యారెక్టరైజేషన్, బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్ వల్ల సినిమా కొత్తగా మారుతుంది. ఈ సినిమా కూడా అలాగే మెప్పిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా చేయాలని ఫ్యామిలీ మూవీ ఎంచుకున్నాను. ఇందులో హీరోయిన్ పాత్ర పేరు భూమి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. ఒకరిపై ఆధారపడదు. మరొకరిని ఇబ్బంది పెట్టడు.  హీరో పేరు ఆకాష్ . పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాలమైన మనసు ఉన్న వ్యక్తి. అతనో ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే  లైఫ్‌‌‌‌‌‌‌‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య కథే ఈ సినిమా. ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలకు, అబ్బాయిలకు కనెక్ట్ అయ్యే సినిమా. ప్రకృతి ఎంత ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలాక్సుడ్‌‌‌‌‌‌‌‌గా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఐడెంటిటీ క్రైసిస్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఓ స్టోరీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మూవీగా ఇదే అనుకుంటున్నాను. ఏ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసినా ప్రేక్షకులను హ్యాపీగా ఫీలయ్యేలా, ఓ మంచి విషయం చెప్పేలా నా సినిమా ఉండాలనుకుంటాను.