గుడిహత్నూర్ (ఇంద్రవెల్లి), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన రెడ్కో అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. హీరాపూర్‌లో సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
ఎంపిక చేసిన ఇండ్లు, వ్యవసాయ కనెక్షన్లకు తక్షణమే సోలార్ బిగించే పనులు ప్రారంభించాలని రెడ్కో అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఈ జయవంత్ రావు చౌహన్, ఉట్నూర్ డీఈ రాం సుబ్బా రెడ్డి, ఏడీఈ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు.
