UPSC రిజల్ట్స్: ఏడో స్థానంలో తెలంగాణ యువకుడు

UPSC రిజల్ట్స్: ఏడో స్థానంలో తెలంగాణ యువకుడు

సివిల్ సర్వీస్ 2018 ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో 759 మంది ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ సారి.. కనిషక్ కటారియా  అతను మొదటి స్థానంలో నిలిచారు. వీరు ఐఐటీ ముంభై లో బీటెక్ చేశారు. కటారియా ప్రస్తుతం డేటా సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. మహిళల విభాగంలో శృతి జయంత్ దేశ్ ముఖ్ టాపర్ గా నిలిచారు. వీరు కెమికల్ ఇంజనీరింగ్ నుండి పట్టభద్రులయ్యారు.

తెలంగాణ యువకుడికి ఏడో ర్యాంకు..
మన రాష్ట్రం నుండి మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డికి 2018 సివిల్స్ లో ఏడో ర్యాంకు వచ్చింది. ఇంతకు ముందు 170వ ర్యాంక్ సాధించిన వరుణ్.. ప్రస్తుతం ఐఆర్ఎస్ శిక్షణలో ఉన్నారు. IAS కావాలనే దృడ సంకల్పంతో… IRS ట్రేనింగ్ లో ఉంటూనే తన ప్రయత్నం మళ్లీ కొనసాగించారు. దీంతో ఈ సారి ఆల్ ఇండియా ఏడవ ర్యాంకు సాధించాడు.  వరుణ్ రెడ్డి తండ్రి కర్నాటి జనార్ధన్ రెడ్డి మిర్యాలగూడలో ప్రముఖ కంటి వైద్యులు కాగా.. వరుణ్ తల్లి పోరెడ్డి నాగమణి మిర్యాలగూడలో వ్యవసాయ శాఖ ఏడీఏగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.