18 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా వరుణ్ సందేశ్–శ్వేతా బసు ప్రసాద్..

18 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా వరుణ్ సందేశ్–శ్వేతా బసు ప్రసాద్..

దాదాపు 18 ఏళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో యూత్‌‌లో  మంచి క్రేజ్ తెచ్చుకున్న   వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి వెండితెరపై కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనున్నారు. వీరిద్దరూ లీడ్ రోల్‌‌లో నటించిన  ఆహా ఒరిజినల్ సిరీస్  ‘నా వైఫ్ మిస్సింగ్’ త్వరలో స్ట్రీమింగ్‌‌కు రాబోతోంది.  

భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌‌లో వరుణ్ సందేశ్ ఫిర్యాదు చేయడం.. ఆ మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటనేది ఈ సిరీస్‌‌లో ఆసక్తికరంగా చూపించనున్నట్టు తెలుస్తోంది.  ‘ప్రతి కేసుకు ఒక కథ ఉంటుంది.. ఈ కేసులో నిజం ఏంటి?’ అనే క్యాప్షన్‌‌తో ఇప్పటికే ఆహా ఈ సిరీస్‌‌పై క్యూరియాసిటీ పెంచింది.  తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌‌ను ఆహా త్వరలో ప్రకటించనుంది. చాలాకాలం తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటిస్తుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.