వరుణ్ సందేశ్ వితికా ..లిప్ లాక్ తో డియర్ అస్ట్రోనాట్ ఫస్ట్ లుక్

వరుణ్ సందేశ్ వితికా ..లిప్ లాక్ తో డియర్ అస్ట్రోనాట్ ఫస్ట్ లుక్

నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన వరుణ్ సందేశ్, వితికా షేరు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ అస్ట్రోనాట్’.  కార్తీక్ భాగ్యరాజా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  

ఒక రాకెట్ ముందు నిలబడి రొమాంటిక్ పోజ్‌‌‌‌ ఇచ్చిన  వరుణ్, వితిక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఈ సందర్భంగా దర్శక నిర్మాత కార్తీక్ భాగ్యరాజా  మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే ఇది.  ఆకాశమే హద్దుగా తాను ఆస్ట్రోనాట్ అవ్వాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటం చాలా ఇన్‌‌‌‌స్పైరింగ్‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పారు.  కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నాడు.