వరుణ్ సందేశ్, దర్శన్ మదమంచి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘హలో ఇట్స్ మీ’. వీఎస్కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫేమ్ షగ్నశ్రీ వేణున్ హీరోయిన్గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తోంది. గురువారం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘ఇటీవల వరుస థ్రిల్లర్స్ చేస్తున్నా. అలాంటి టైమ్‌లో ఇలాంటి మంచి ఫ్యామిలీ, లవ్ స్టోరీలో నటించడం రిలీఫ్‌గా ఉంది. ఇదొక క్లీన్ ఫ్యామిలీ మూవీ. అపార్థాలతో యువతీ యువకుల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూపించబోతున్నాం.
నా రీసెంట్ ప్రాజెక్ట్ ‘నయనం’ కూడా లేడీ డైరెక్టర్ స్వాతి చేశారు. ఇప్పుడు షగ్న కూడా ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నా. కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రంలోని పాటలతో ఆ ఒరవడి కొనసాగుతుంది’ అని చెప్పాడు.
షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ ‘ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. ప్యాషనేట్ టీమ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు. నటులు దర్శన్, భద్రమ్, జశ్వంత్, నందిని సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
