
టాలీవుడ్ క్యూట్ కపూల్ వరుణ్-లావణ్యల కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా తమ వెకేషన్ ఫోటోలతో నెటిజన్లని ఆకర్షించింది ఈ జంట. ప్రశాంతమైన బీచ్ నడుమ వారి అందమైన విహారయాత్రలో ఆనందంగా గడుపుతున్నారు. ఈ ఫోటోలకు మెగా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం లావణ్య ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ క్రమంలో లావణ్య ఎక్కువ ప్రశాంతంగా ఉండేలా వరుణ్ ఈ హాలిడే ట్రిప్ ప్లాన్ చేయడం బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఫోటోలలో వీరిద్దరినీ చూస్తుంటే ఎవరి దిష్టి అయిన తగలొచ్చని మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ జంట మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. వారు మొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2023 నవంబర్ 1న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2025 మే6న తాము తల్లిదండ్రులు కానున్నట్లు అనౌన్స్ చేస్తూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు..‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాము. కమింగ్ సూన్’ అని తాము ఇరువురు క్యాప్షన్ పెట్టారు.
ఇదిలా ఉంటే.. లావణ్య త్రిపాఠి కొత్త సినిమాలు ఏం చేయట్లేదు. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘సతీ లీలావతి’ సినిమా చేసింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య తెరకెక్కించాడు.
►ALSO READ | Genelia: ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్లపై.. జెనీలియా ప్రశంసల వర్షం
వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ మూవీ చేస్తున్నాడు. వరుణ్ కెరీర్‌లో ఇది 15వ చిత్రం. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, అనంతపూర్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో కొరియా షూట్ కు సిద్దమవుతుంది. 2025 చివర్లో రిలీజ్ కానుంది.
Life’s most beautiful role yet
— Lavanya konidela tripathi (@Itslavanya) May 6, 2025
- coming soon ♥️♥️♥️ pic.twitter.com/cNwbCxFiuF