ఆపరేషన్ వాలెంటైన్..  డబ్బింగ్ షురూ 

ఆపరేషన్ వాలెంటైన్..  డబ్బింగ్ షురూ 

వరుణ్ తేజ్ హీరోగా యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతుండగా..  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌‌గా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి బుధవారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ALSO READ: ఓటీటీలోకి  హన్సిక ఎంట్రీ 

మరోవైపు వీఎఫ్‌‌ఎక్స్ జరుగుతున్నాయని.. ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను అందించడం కోసం ఎక్స్​ట్రా కేర్ తీసుకుంటున్నామని మేకర్స్ తెలియజేశారు. అలాగే అక్టోబర్ 8న  ఎయిర్‌‌ఫోర్స్ డే రోజున ఓ సర్ ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.