ఆపరేషన్ వాలెంటైన్..ప్రతి భారతీయుడు కనెక్ట్ అవుతాడు 

ఆపరేషన్ వాలెంటైన్..ప్రతి భారతీయుడు కనెక్ట్ అవుతాడు 

‘ఆపరేషన్ వాలెంటైన్’ నేషనల్ అప్పీల్ ఉన్న కంటెంట్ అని, భారత సైనికుల త్యాగాలను,  ధైర్య సాహసాలను ఇందులో చూపించాం అని చెప్పాడు వరుణ్ తేజ్. హిందీ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించగా, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, సందీప్ ముద్దా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ  భాషల్లో మార్చి 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. 

  •     శక్తి ప్రతాప్ చెప్పిన కథ నాకు బాగా  నచ్చింది. దీనికోసం తను చాలా రీసెర్చ్ చేశాడు.  ఈ  కాన్సెప్ట్‌‌‌‌నే గతంలో షార్ట్ ఫిల్మ్‌‌‌‌గా తీస్తే.. ఎయిర్ ఫోర్స్ అధికారులు చూసి షాక్ అయ్యారు. సినిమాగా తీస్తే మరింత సమాచారం ఇస్తామని తనకు చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 
  •  2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌‌‌‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకున్నాయి. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌‌‌‌గా  ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ. అందుకే ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ బెస్ట్ అనుకున్నాం. 
  •     ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు. దీని కోసం నేను చాలా విషయాలు తెలుసుకున్నా.  అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపు తిరుగుతుంది లాంటివన్నీ ముందే ఒక పైలెట్‌‌‌‌ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. కొద్దిరోజుల పాటు ఒక ఫ్లైట్ సిమ్యులేటర్‌‌‌‌‌‌‌‌లో  కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు.  అందులో కూర్చుంటే రియల్‌‌‌‌గా ఫ్లైట్ నడిపినట్లే ఉంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది.
  •     ఇందులో హీరోయిన్‌‌‌‌గా నటించిన  మానుషి చిల్లర్ మిస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌గా దేశానికి పేరు తీసుకొచ్చారు.  పాత్రపై చాలా ఫోకస్‌‌‌‌గా ఉంటుంది. రాడర్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించడానికి ఆమె చాలా హోం వర్క్ చేసింది. అలాగే వింగ్ కమెండర్ కబీర్ పాత్రలో నవదీప్  కనిపిస్తాడు. అభినవ్ గోమఠం మరో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. 
  •     మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఇందులో పాటలు కూడా ఎమోషనల్‌‌‌‌గా ఉంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు కూడా చాలా బలంగా ఉంటుంది.  
  •     ప్రతి భారతీయుడు ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కొందరు ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసి ప్రశంసించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా చాలా బాగా కనిపిస్తున్నానని బాబాయ్ పవన్ కళ్యాణ్ చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి  సినిమాలు ఆయనకు చాలా ఇష్టం. ఇక ప్రస్తుతం ‘మట్కా’ మూవీ చేస్తున్నా. ఇందులోనూ పెర్ఫార్మెన్స్‌‌‌‌కు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నా. ఇదొక కమర్షియల్ రివెంజ్ డ్రామా..

ఇలాంటి పాత్రలు చేయడం ఒక చాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి ఉంటుంది. ఎమోషన్‌‌‌‌ని కళ్ళతోనే పలికించాలి.  ఇక  హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నా. డిక్షన్‌‌‌‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక్కోసారి తెలుగు సీన్స్‌‌‌‌ చేసేటప్పుడు, అప్పటికే హిందీ సీన్ చేయడంతో ఆ డైలాగ్స్ వచ్చేవి. అలాగే హిందీ సీన్స్ చేసేటప్పుడు మధ్యలో తెలుగు డైలాగ్స్ వచ్చేవి. అప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని 
మళ్లీ చేసేవాళ్ళం.