varun tej : జనవరి 19న వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్

varun tej : జనవరి 19న వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే సినిమా వీటీ12 నుంచి అప్ డేట్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ను జనవరి 19న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను SVSS బ్యానర్ పై ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఎఫ్3 సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రతీ సినిమాతో కొత్త రోల్ ని ఎంచుకునే వరుణ్ తేజ్ ఈసారి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆ స్థాయి రోల్ తో తీస్తున్న సినిమా ఇది.