ఇండియా తొలితరం క్రికెటర్ వసంత్ రాయ్​జీ కన్నుమూత

ఇండియా తొలితరం క్రికెటర్ వసంత్ రాయ్​జీ కన్నుమూత

ముంబై: ఇండియా తొలితరం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత్ రాయ్​జీ(100) కన్నుమూశారు. ముంబై వాల్కేశ్వర్​లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున వృద్ధాప్యం కారణంగా రాయ్​జీ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1920లో గుజరాత్​లో పుట్టిన రాయ్​జీ 1939లో క్రికెట్ క్లబ్ ఆప్ ఇండియా జట్టు తరఫున తొలిసారి క్రికెట్ ఆడారు. 1940 లలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. దక్షిణ ముంబైలోని బొంబాయి జింఖానాలో రాయ్​జీ 13 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక అనేక రచనలు చేశారు. ఇండియాలో తొలితరం క్రికెట్ చరిత్రకారుడిగా పేరుపొందారు. క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా.. రాయ్​జీకి 100 ఏళ్లు నిండినప్పుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.