వసంత పంచమి అంటే సరస్వతి దేవి పూజతో పాటు అక్షరాభ్యాసం గుర్తుకు వస్తుంది. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 23న వసంత పంచమి వచ్చింది. ఆరోజు అక్షరాభ్యాసానానికి శుభ ముహూర్తం.. ఎప్పుడుంది.. ఏ సమయంలో చదువును ప్రారంభించాలి.. ఇలాంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మాఘమాసం కొనసాగుతుంది. ఈ నెలలోనే చదువుల తల్లి సరస్వతి పుట్టిన రోజు వసంత పంచమి .. ఈ ఏడాది వసంత పంచమి జనవరి 23 వ తేది వచ్చింది. ఆ రోజును వసంత పంచమి అంటారు. హిందూ మతానికి చెందిన చదువుకునే పిల్లలు వసంతపంచమి రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. కొత్తగా చదువులోకి అడుగుపేట్టేవారికి ఆరోజు ( జనవరి 23) వతేదీన అక్షరాభ్యాసం చేయిస్తారు.
శుభ ముహూర్తం
మాఘ మాసం శుక్ల పక్షం పంచమి తిథి జనవరి 23 శుక్రవారం తెల్లవారు జామున 2.22 గంటలకు ప్రారంభమై, జనవరి 24 శనివారం తెల్లవారుజామున 1.46 గంటలకు ముగుస్తుంది. ఆరోజున అక్షరాభ్యాసానికి సంబంధించిన శుభ ముహూర్తం జనవరి 23 న ఉదయం 7.15 నుంచి మధ్యాహ్నం 12.33 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఉదయం 8.55 గంటల నుంచి 9.41 గంటలవరకు దుర్ముహూర్తం ఉండటంతో ఆ సమయంలో కాకుండా మిగతా సమయంలో అక్షరాభ్యాసం చేయించడం మంచిదని పండితులుసూచిస్తున్నారు.
వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చదువు ప్రారంభిస్తే పిల్లలు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం వసంత పంచమి అనేది జ్ఞాన దేవత సరస్వతి దేవి పుట్టిన రోజు కావడంతో పాటు వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే విద్యాభ్యాసం ప్రారంభానికి ఈ రోజు ( 2026 జనవరి 23) చాలా మంచి రోజని భావిస్తారు.
వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాంతులు అవుతారని భక్తుల నమ్మకం. అందుకే వసంత పంచమి ఘడియల్లో జనవరి 23) అక్షరాభ్యాసానికి ముహూర్తంతో సంబంధం లేకుండా చూడకుండా అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆరోజు సరస్వతి దేవి చదువుల తల్లి పుట్టిన రోజు కాబట్టి సరస్వతీ దేవి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుస్తకాలు, పెన్నులు, బలపాలు వంటి విద్యాసంబంధిత వస్తువులను దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తి...వీటి స్వరూపమే సరస్వతీదేవి. అమ్మ అనుగ్రహం ఉంటే సద్భుద్ధిని పొందుతారు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
