Vastu Tips : కింద సింగిల్ బెడ్ రూం.. పైన డబుల్ బెడ్ రూం కట్టుకోవచ్చా.. డ్రేనేజీ వాటర్ ఎటు నుంచి బయటకు పోవాలి

Vastu Tips :  కింద సింగిల్ బెడ్ రూం.. పైన డబుల్ బెడ్ రూం కట్టుకోవచ్చా.. డ్రేనేజీ వాటర్ ఎటు నుంచి బయటకు పోవాలి

వాస్తు ప్రకారం  సింగిల్​ బెడ్​ రూం ఇంటిపైన డబుల్​ బెడ్​ రూం ఇల్లు నిర్మించుకోవచ్చా.. అలాంటప్పుడు ఎలాంటి పద్దతులను అవలంభించాలి.. నార్త్​ సైడ్​ నుంచి మురుగు నీరు డ్రైనేజీలో కలిస్తే ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా.. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. . 

ప్రశ్న: మాది సింగిల్ బెడ్రూం ఇల్లు, పైన డబుల్ బెడ్రూం కట్టుకోవాలనుకుంటున్నాం. కింద ఇంట్లో కిచెన్, హాల్ పెద్దవి. మాది పడమర వాకిలి ఇల్లు, ఆగ్నేయంలో కిచెన్, ఈశాన్యంలో బెడ్రూం అనుకుని బాత్రూం ఉన్నాయి. పైన డబుల్ బెడ్రూం ఎలా కట్టుకుంటే మంచిది?

జవాబు: కింద సింగిల్ బెడ్ రూం ఉన్నా పైన డబుల్ బెడ్రూం కట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కింద ఫ్లోర్ వాస్తు ప్రకారం ఉంది. కింద హాల్, బెడ్ రూమ్ పెద్దవి కాబట్టి వాటి సైజు తగ్గించి, ఆ ప్లేసులో పైన రెండు బెడ్ రూమ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. పైకి వెళ్లడానికి మెట్లు ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు పెట్టుకోవాలి. కిచెన్ ఆగ్నేయంలో ప్లాన్ చేసుకోండి. ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న సిద్ధాంతికి చూపించి సలహా తీసుకోండి.

ప్రశ్న: మా ఇంటికి నార్త్​ సైడ్​ లో మెయిన్​ గేట్​ ఉంది. మురుగు నీరు అటువైపున్న డ్రైనేజీలో కలుస్తుంది. అక్కడే వాటర్​ ట్యాంక్​ఉంది.  ఒక్కోసారి డ్రైనేజ్​ పైపు లీకవడం వల్ల  రెండూ కలుస్తున్నాయి. అందుకని డ్రైనేజ్ పైపు, నీళ్ల ట్యాంకు మార్చాలనుకుంటున్నాం. ఎటువైపు మార్చాలి?

జవాబు:  మురుగు నీరు, మంచి నీళ్ల పైపులు ఒకే దగ్గర ఉంటే లీకైనప్పుడు సమస్యలు తప్పవు. మంచి నీళ్ల ట్యాంకుకు మురుగు నీళ్ల పైపు వీలైనంత దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం మంచి నీళ్ల ట్యాంకు తప్పకుండా ఇంటికి ఈశాన్యంలో ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఆగ్నేయంలో ఉండాలి. మీది నార్త్ సైడ్ ఇల్లు కాబట్టి ముందుగా వాటర్ ట్యాంకును పూర్తి ఈశాన్యంవైపు మార్చుకోండి.