ఆ భూమితో మంత్రి పొంగులేటి ఫ్యామిలీకి సంబంధం లేదు

ఆ భూమితో మంత్రి పొంగులేటి ఫ్యామిలీకి సంబంధం లేదు
  •     కావాలనే కేటీఆర్, హరీశ్​రావు ఆరోపణలు  
  •     మీడియాతో వట్టినాగులపల్లి భూమి యజమానులు

పంజాగుట్ట, వెలుగు: వట్టినాగులపల్లిలో ఓ వ్యవసాయ భూమి విషయంలో జరుగుతున్న వివాదానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని సదరు భూమి యజమానులు స్పష్టం చేశారు. 

మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్​స్ట్రక్షన్స్​తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, బీఆర్ఎస్​లీడర్లు కేటీఆర్, హరీశ్​రావు అనవసరంగా మంత్రి కుటుంబసభ్యుల పేర్లను తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో భూయజమానులు అవినవ్​ షా, సుధీర్​కుమార్​షా మాట్లాడారు.