ఏడాదిన్నరగా కూసోవెట్టి జీతాలు

ఏడాదిన్నరగా కూసోవెట్టి జీతాలు

ఖాళీగా వయోజన విద్య ఎంప్లాయీస్‌

సాక్షర భారత్‌ ముగియడం… కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో ‘వయోజన విద్య’ విభాగం ఎంప్లాయీస్‌ ఏడాదిన్నరగా ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్రంలో 8,690 గ్రామాల్లో సాక్షర భారత్‌ కేంద్రాలుండేవి. వాటిలో 17,380 మంది గ్రామ కోఆర్డినేటర్లను, మండలానికొక కో-ఆర్డినేటర్‌ ను నియమించారు. ఈ విభాగంలో 70 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారు. 62 మోడల్‌
వయోజనవిద్య కేంద్రాలు, గ్రామాల్లో మినీ లైబ్రరీలు ఏర్పాటు చేశారు.

ఒక్కో కేంద్రంలో రూ.3 లక్షలకుపైగా విలువైన కంప్యూటర్లు.. పుస్తకాలుం డగా, మినీ లైబ్రరీలో లక్ష రూపాయల విలువైన పుస్తకాలు, ఫర్నిచర్‌ ఉంది. 2018 మార్చి31తో సాక్షరభారత్‌ ప్రోగ్రామ్‌ ముగిసింది. అప్పటి నుంచి 70 మంది ఎంప్లా యీస్‌ ఖాళీగా ఉంటున్నారు. వీరిని స్కూల్‌ ఎడ్యుకేష న్‌ లో కలిపేస్తారనే ప్రచారం సాగుతున్నా.. దానిపై స్పష్టత లేదు. ఉన్నతాధికాలు ఇన్నాళ్లుగా ఎంప్లా యీస్‌ సేవలు, కోట్ల రూపాయల విలువైన పుస్తకాలు, సామగ్రిని వినియోగించుకోలేక పోతున్నారు. విషయం ఆ విభాగం డైరెక్టర్‌ సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా తమ సిబ్బంది సేవలు కలెక్టర్లు వినియోగించుకుంటున్నారని, సెప్టెంబరులో కొత్త ప్రోగ్రామ్‌ వచ్చే అవకాశముందన్నారు