
నస్పూర్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెక్టర్ బోర్న్ డిసీజెస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత తెలిపారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటి పరిధిలోని నస్పూర్ గేట్ ప్రాంతంలో నిర్వహించిన వైద్య శిబిరం, ఇంటింటా 'డ్రైడే' పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటి చుట్టు పక్కల నీటి గుంతలను పూడ్చివేయాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, వైద్యాధికారి డాక్టర్ సమత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.