
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత కీలకమైన మెటల్స్ బిజినెస్‌లను సపరేట్ చేయాలని చూస్తోంది. ఇంకో రెండు నెలల్లో అల్యూమినియం, ఐరన్, స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్‌లను సపరేట్ లిస్టెడ్ కంపెనీలుగా మారుస్తామని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. ఇప్పటికే జింక్ బిజినెస్‌ను వేదాంత సబ్సిడరీ కంపెనీ హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ చూస్తున్న విషయం తెలిసిందే. ఇలా బిజినెస్‌లను సపరేట్ చేయడంతో షేరు హోల్డర్ల వాల్యూ మరింత పెరుతుందని, వీటి బిజినెస్ సెగ్మెంట్‌లలో ఈ సపరేట్ కంపెనీలు మరింత ఎదగడానికి వీలుంటుందని అనిల్ అగర్వాల్ అంచనావేశారు. ‘ వివిధ బిజినెస్‌లలో మార్కెట్ బాగుంది. కంపెనీ ప్రొడక్షన్ కూడా బాగుంది. అందుకే సపరేట్ కంపెనీలను ఏర్పాటు చేస్తే వాల్యు క్రియేట్ అవుతుందని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. వేదాంత బిజినెస్‌లను సపరేట్ కంపెనీలుగా మార్చడంతో మూడు లిస్టెడ్ కంపెనీలు ఏర్పడతాయి. దీంతో వేదాంత గ్రూప్‌కు మొత్తం ఐదు లిస్టెడ్ కంపెనీలు ఉంటాయి. అవి వేదాంత లిమిటెడ్‌తో పాటు మూడు కొత్త కంపెనీలు. ఒక సబ్సిడరీ కంపెనీ హిందుస్తాన్ జింక్. కాగా, అదానీ గ్రూప్ కూడా తమ కీలక బిజినెస్‌లను సపరేట్ కంపెనీలుగా మార్చి మార్కెట్‌లో లిస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.