విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రియా శిబు నిర్మిస్తున్నారు. ఇటీవల విక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు చక్కని స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం తమిళనాడు పశ్చిమ కనుమల్లోని తెన్ కాశిలో షూటింగ్ చేస్తున్నట్టు చెప్పారు. మేజర్ పార్ట్ చిత్రీకరణ అంతా అక్కడే జరుపనున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో వెనుక కిరాణా సరుకులు, ముందు హీరోయిన్ దుషారా విజయన్‌తో లూనాపై వెళ్తూ కనిపించాడు విక్రమ్. కిరాణా షాపు నడుపుకునే వ్యక్తిగా ఇందులో విక్రమ్ నటిస్తున్నట్టు ఇప్పటికే టీజర్‌లో చూపించారు. మలయాళ నటుడు సిద్ధిఖీతో పాటు ఎస్.జె.సూర్య ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విక్రమ్ కెరీర్‌లో ఇది 62వ చిత్రం. మరోవైపు విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ‘తంగలాన్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
