‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..!

‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..!

నటసింహ నందమూరీ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్ లో జరగనుంది. ఒంగోలులో మాస్ జాతర అంటూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ మేకర్స్ ట్వీట్ చేసింది.

ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో మూవీ సాగనున్నట్లు తెలస్తోంది.