వీర విక్రమ్​

వీర విక్రమ్​

కమల్ హాసన్‌‌ నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. ఈసారి ఆయన ఓ యాక్షన్ మూవీతో వస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా కమల్ హాసనే. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి మరో ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్‌‌ కూడా ఇందులో నటిస్తుండడంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. వాటిని మరింత పెంచే స్థాయిలో నిన్న రాత్రి చెన్నైలో ఆడియో రిలీజ్‌‌ వేడుక గ్రాండ్‌‌గా జరిగింది. అనిరుధ్‌‌ రవిచందర్ సంగీతం అందించిన పాటలతో పాటు ట్రైలర్‌‌‌‌ను ఇదే వేదికపై లాంచ్ చేశారు.  

‘ఒక అడవిలో సింహం, పులి, చిరుత వేటాడేందుకు తిరుగుతున్నాయి. జింక తన ప్రాణం కోసం పరుగెడుతోంది. కానీ అప్పటికి సూర్యుడు అస్తమిస్తే కొత్త ఉదయాన్ని చూడటానికి ఏ జంతువు జీవించి ఉంటుందనేది ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు పగటిపూటను చూస్తారో నిర్ణయించేది ప్రకృతి కాదు.. అది నేనే’ అంటూ కమల్ క్యారెక్టర్‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేశారు. కమల్‌‌తో పాటు సేతుపతి, ఫహద్‌‌ లుక్స్, యాక్టింగ్‌‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. నైట్ ఎఫెక్ట్ విజువల్స్, అనిరుధ్‌‌ బ్యాగ్రౌండ్‌‌ స్కోర్ యాక్షన్‌‌ సీన్స్‌‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.  ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేలా ఈ ట్రైలర్‌‌‌‌ ఉంది. ఖైదీ, మాస్టర్‌‌‌‌ చిత్రాలను మించిన కొత్త తరహా కాన్సెప్ట్‌‌తో కనకరాజ్ ఈ మూవీ తీసినట్టు అర్థమవుతోంది. జూన్ 3న సినిమా విడుదల కానుంది.