శివ శివా : బ్రాహ్మణ పూజారికి చిల్లీ చికెన్ డెలివరీ.. ఈ తర్వాత ఏమైందీ..?

శివ శివా : బ్రాహ్మణ పూజారికి చిల్లీ చికెన్ డెలివరీ.. ఈ తర్వాత ఏమైందీ..?

అతను నిష్ఠా నిష్ఠ గరిష్టుడు.. బ్రాహ్మణ పూజారి కూడాను.. అతని పేరు రాకేష్ కుమార్ శాస్త్రి. పక్కా శాఖాహారి. ఆయన ఇంట్లోకి నీచు వాసన కూడా రాదు.. అలాంటి శాస్త్రి గారు.. ఫుడ్ డెలివరీ యాప్ లో చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేశారు.. డెలివరీ ఎంతో వేగంగా.. వేడి వేడిగా ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి వేడి వేడి చిల్లీ చికెన్ ను.. చిల్లీ పన్నీర్ అనుకుని తినటం ప్రారంభించారు. మొదటి ముక్కకు అనుమానం రాలేదు.. రెండో ముక్క తినగా అనుమానం వచ్చింది.. బాగా పరిశీలించి చూడగా.. అది చిల్లీ చికెన్.. అంతే శాస్త్రిగారు ఆ ఫుడ్ ఐటమ్ ను అక్కడే పడేసి.. తాను ఆర్డర్ చేసింది.. డెలివరీ వచ్చింది.. బిల్లులు అన్నింటినీ వీడియో తీశారు. పోలీసులకు కంప్లయింట్ చేశారు.. పోలీసులు ఏకంగా ఆ రెస్టారెంట్ పై కేసు నమోదు చేశారు.. క్లుప్తంగా ఇదీ.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, లక్నోలోని చైనీస్ రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదైంది. ఈ వారం చిల్లీ పనీర్ కు బదులు చిల్లీ చికెన్ పంపారని ఓ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు ఫైల్ చేశారు. స్థానిక లార్డ్ బాలాజీ టెంపుల్‌తో అనుబంధంగా ఉన్న రాకేష్ కుమార్ శాస్త్రి, తన కుటుంబం అనుకోకుండా ఆ వంటకాన్ని తినేశారని తీవ్ర విచారం వ్యక్తం చేశారురు. అక్టోబరు 9న అలంబాగ్‌లోని చైనీస్ వంటకాల రెస్టారెంట్ నుంచి ప్రముఖ యాప్ ద్వారా శాస్త్రి, అతని కుటుంబం ఫుడ్ ఆర్డర్ చేయగా ఈ సంఘటన జరిగింది.

“నేను లక్నోలోని అలంబాగ్ ప్రాంతంలో ఉన్న చైనీస్ రెస్టారెంట్ నుంచి డ్రై చిల్లీ పనీర్ ఆర్డర్ చేశాను. కానీ, నాకు చిల్లీ పనీర్ బదులు, రెస్టారెంట్ డెలివరీ బాయ్ ఇమ్రాన్ నాన్-వెజిటేరియన్ డిష్‌ను అందించారు. అది నేను, నా కుటుంబం తిన్న తర్వాతే గ్రహించాం”అని ఎఫ్‌ఐఆర్ లో నమోదైంది.

శాస్త్రి తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, తన కుటుంబ ఆరోగ్యం దెబ్బతిందని ఆరోపించారు. ఈ సంఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 1.05 నిమిషాల వీడియోలో, రెస్టారెంట్ తన నమ్మకాన్ని కోల్పోయిందని శాస్త్రి ఆరోపించారు. ఈ క్రమంలోనే సంబంధిత సెక్షన్ల కింద డెలివరీ ఎగ్జిక్యూటివ్, రెస్టారెంట్ యజమానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.