
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఎన్నికల దృష్ట్యా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు. రెండు రోజుల కింద జిల్లాకు వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలు టీమ్లుగా ఏర్పడి వాహనాల చెకింగ్ నిర్వహించారు. వన్ టౌన్ ఎస్హెచ్ వో విజయబాబు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా, గాంధీచౌక్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.