వాహనదారులకు షాక్.. పెండింగ్ చలాన్ కట్టకపోతే వాహనం సీజ్

వాహనదారులకు షాక్.. పెండింగ్ చలాన్ కట్టకపోతే వాహనం సీజ్

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న చలాన్లను కట్టకపోతే పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి.. ఆన్ లైన్ లో చలాన కట్టాలంటూ మెసెజ్ పంపిస్తున్నారు. అయిదు అంతకంటే ఎక్కువ చలాన్లు ఉన్నవాళ్లకి అయితే ఏకంగా నోటీసులు పంపిస్తున్నారు. అయితే వాహనదారులు మాత్రం ఆన్ లైన్ పేమెంట్ ఉండటంతో చలాన్లను లైట్ తీసుకుంటున్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్ల మీదికొచ్చిన వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. చలాన్లు పెండింగ్ లో ఉంటే అక్కడే కట్టించుకొని పంపిస్తున్నారు. ఒకవేళ చలాన్ కట్టకపోతే.. వాహనాలను స్టేషన్ కు తరలిస్తున్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్న వాహనాలను మాత్రం వెంటనే సీజ్ చేస్తున్నారు. ఒకవేళ వాహనం సీజ్ అయితే.. పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాహనదారులు వెంటనే చలాన్లు కడుతున్నారు.

లాక్డౌన్ టైంలో హైదరాబాద్ పరిధిలో 21 లక్షల చలాన్లు విధించారు. వాటి విలువ సుమారు రూ. 14 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో సగానికి పైగా నో హెల్మెట్ చలాన్లే కావడం విశేషం. తాజాగా ప్రభుత్వం వాహనం నడిపే వారితో పాటు.. వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వాహనానికి సైడ్ మిర్రర్స్ కూడా కంపల్సరీ చేసింది. సో రోడ్డెక్కెముందు అన్నీ చెక్ చేసుకొని వెళ్తే మంచిది.

For More News..

ఎంఆర్వో ఆఫీస్ ముందు రైతన్న ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..

మందు తాగి డ్యూటీ చేస్తున్న పోలీసులు

వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..