భారీ వర్షం.. కొట్టుకుపోతున్న వాహనాలు

భారీ వర్షం.. కొట్టుకుపోతున్న వాహనాలు

హైదరాబాద్లో కురుస్తోన్న భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. కాలనీలు, గల్లీలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం  ఏర్పడింది. బోరబండలో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వరద నీరు చేరగా.. వరద ప్రవాహంలో ఆటోలు, బైకులు కొట్టుకుపోయాయి. వరద నీటిలో బైక్, ఆటోలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు రసూల్పూరాలో  ఇళ్లలోకి వరద నీరు చేరగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు 

రాగల మూడు గంటల్లో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు,  ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మెదక్ ,కామారెడ్డి, సిద్దిపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్, వికారాబాద్ ,నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, గద్వాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో  రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు  కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.