
ముషీరాబాద్, వెలుగు: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వైపు స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్ బండ్, కనకాల కట్ట మైసమ్మ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు డైవర్షన్ చర్యలు చేపట్టారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పైన ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జి. సుధీర్ బాబు తెలిపారు.
శనివారం ట్రాఫిక్ అధికారులతో కలిసి ఇందిరాపార్క్, ముషీరాబాద్ తహసీల్దార్ ఆఫీసు, కనకాల కట్ట మైసమ్మ చౌరస్తా ప్రాంతాలను పరిశీలించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి కనకాల కట్ట మైసమ్మ చౌరస్తా, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌కు వెళ్లే దారిని మళ్లించి, ముషీరాబాద్ తహసీల్దార్ ఆఫీసు నుంచి ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లేందుకు ట్రాఫిక్ డ్రైవర్షన్ చేసినట్లు తెలిపారు. వాహనదారులు గమనించాలని సూచించారు. ట్రాఫిక్ అధికారులు షాకీర్ హుస్సేన్, రత్నం, వీరేశ్, రమేశ్ ఉన్నారు.