తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి

 తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంత్రిగా కాకుండా ప్రైవేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మీరు కొంటె కొనండి లేదంటే..ప్రజలకు నూకల బియ్యం  తినిపించండి అని అన్నాడన్నారు. తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్ మైండ్ లేకుండా రోజుకో మాట మాట్లాడుతుండన్నారు. బండి సంజయ్ కి ఒంట్లో నెత్తురు ఉంటే కేంద్రం చేత ధాన్యాన్ని కొనిపించాలన్నారు. పీయూష్ గోయల్ స్వయంగా  ఫోన్ చేసినా కిషన్  రెడ్డి మీటింగ్ కు రాలేదన్నారు. ధాన్యం కొనాల్సిన భాద్యత కేంద్రానిదేనన్నారు. దేశంలోని ధాన్యం అంతా కేంద్రమే కొనుగోలు చేస్తదని రేవంత్ రెడ్డికి తెల్వదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి భాద్యత లేదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనాలని రేవంత్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగటం లేదన్నారు.  బీజేపీ,కాంగ్రెస్ రెండు ఒక్కటే అని మరోసారి రుజువైందన్నారు.