- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రానున్న -సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను కోరారు. బుధవారం ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉచిత దర్శనం, క్యూలైన్లు, కోడె క్యూలైన్, కల్యాణ కట్ట, వీఐపీ రోడ్డు క్యూలైన్లను పరిశీలించారు.
అనంతరం అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, సైన్ బోర్డులు, టాయిలెట్లు, స్నానాల గదులు (షవర్స్), లైటింగ్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, లైన్ మార్కింగ్‌లు, అమ్మవారి గోడలపై డిజైన్స్,శానిటైజేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

