
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండోసారి కరోనా బారినపడడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. వెంకయ్యనాయుడు కరోనాకు గురికావడం విచారకరం అని తెలిపారు. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కరోనా పాజిటివ్ రావడంతో వెంకయ్యనాయుడు ప్రస్తుతం హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.