అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ.. ఎమోషనల్ అయిన నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ.. ఎమోషనల్ అయిన నాగార్జున

తెలుగు జాతి గర్వించ దగ్గ నటుడు అక్కినేని నాగేశ్వర రావు(Akkineni Nageswara rao) శతజయంతి కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు అల్లు అరవింద్‌, మోహన్‌బాబు, మురళీమోహన్‌, జయసుధ, బ్రహ్మానందం, శ్రీకాంత్‌, జగపతిబాబు, , రాజేంద్రప్రసాద్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, రాజమౌళి, కీరవాణి, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఎమోషనల్ అయ్యారు నాగార్జున. అనంతరం తన తండ్రికి పుష్పలతో నివాళులు అర్పించారు.

Also Read : అధికారంలోకి రాగానే గ్యారంటీ స్కీమ్​లు అమలు : మియ్యప్పన్​

ఇక ఏఎన్నార్ విషయానికి వస్తే.. ఆయన కృష్ణ జిల్లా రామాపురం అనే చిన్న గ్రామంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. తన అద్భుతమైన నటనతో దాదాపు 70 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరించారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయనకి చేసిన సేవలు కూడా అనిర్వచనీయం. తెలుగు సినిమా హైదరాబాద్ తరలిరావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రయాణంలో ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు ఎన్నో ఎన్నెన్నో. దాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులు సైతం ఏఎన్నార్ నటన నైపుణ్యానికి, కళా సేవకు దాసోహం అయ్యాయి. ఇక ఏఎన్ఆర్ 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు.