డబ్ల్యూటీఐటీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వెంకట్

డబ్ల్యూటీఐటీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వెంకట్

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీఐటీసీ) చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల, స్ప్రైపిల్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్​, సీఈఓ బూరా వెంకట్​ను సంస్థ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఈ నెల 27న ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది. బూర వెంకట్ కు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఐటీ రంగంలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. టీసీఎస్‌‌‌‌‌‌‌‌, యాక్సెంచర్‌‌‌‌‌‌‌‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, నార్త్ అమెరికా, యూరప్, ఆసియా–-పసిఫిక్ ప్రాంతాల్లో జ్యూరిచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎరిక్సన్ వంటి ఫార్చ్యూన్ 500 సంస్థలకు పెద్ద ఎత్తున టెక్నాలజీ సొల్యూషన్లు అందించారు. సనెలా హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌, శ్రీబ్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారు. ప్రస్తుతం స్ప్రైపిల్‌‌‌‌‌‌‌‌ ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఏఐ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ను 
అందిస్తున్నారు.