నారప్ప నాకో సవాల్‌‌‌‌

నారప్ప నాకో సవాల్‌‌‌‌

తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే ఎన్నో చాలెంజింగ్‌‌‌‌ రోల్స్ చేసి విజయం సాధించారు వెంకటేష్. అయితే ‘నారప్ప’ పాత్ర అన్నిటికంటే చాలెంజింగ్ అంటున్నారాయన.  తమిళ సూపర్​ హిట్​ ‘అసురన్​’కి ఇది రీమేక్​. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు.  ఈ చిత్రం జులై 20న ఓటీటీలో రిలీజ్ కానున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించారు వెంకటేష్.

  • ఓటీటీ రిలీజ్ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. సాధార‌‌‌‌ణంగా ఎవ‌‌‌‌రికైనా కొన్ని ఫ‌‌‌‌స్ట్ థింగ్స్ అంటూ ఉంటాయి. ఇది కూడా నా లైఫ్‌‌‌‌లో ఫ‌‌‌‌స్ట్ టైమ్ అనుకుంటాను త‌‌‌‌ప్ప మ‌‌‌‌రీ ఎక్కువ‌‌‌‌గా ఆలోచించ‌‌‌‌ను. ఓటీటీ రిలీజ్‌‌‌‌పై ఫ్యాన్స్ హర్ట్ అయిన మాట నిజమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు. అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నా. వాళ్లకి సారీ చెబుతున్నా. కొత్త మార్పుల్ని మనం స్వాగతించాలి. నిజానికి ఓటీటీ అభివృద్ది చెందడం మంచి పరిణామమే.
  • ‘అసురన్‌‌‌‌’ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్టవుతుందనిపించింది. అన్నయ్య సురేశ్‌‌‌‌కి కూడా ఇందులో ఏదో విషయం ఉందనిపించింది. క్యారెక్టర్‌‌‌‌లోకి లోతుగా వెళ్తే గట్‌‌‌‌ ఫీలింగ్‌‌‌‌ కలిగింది. ఎన్నో రీమేక్స్​లో నటించినా ఇది నాకు కొత్తగా అనిపించింది. ‘నారప్ప’ పాత్ర నాకు సవాల్‌‌‌‌ విసిరింది. అందుకే ఒరిజిన‌‌‌‌ల్‌‌‌‌ వెర్షన్​ చూశాక క్షణం కూడా ఆలోచించకుండా సినిమా అంగీకరించాను. చాలాకాలం తర్వాత సాలిడ్ ఎమోషన్స్‌‌‌‌, పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్ యాక్షన్ సీన్స్ చేయడం చాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. మేకప్ లేకుండా నటించాను. యాభై రోజుల పాటు అదే గెటప్‌‌‌‌లో హోటల్‌‌‌‌ రూమ్‌‌‌‌లో ఉన్నాను. బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. 
  • శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. 
  • రీమేక్స్ అనగానే కంపేరిజన్స్ ఉంటాయని తెలుసు. చంటి, సుందరకాండ సినిమాలు రీమేక్స్ అయినా వాటిలో చాలా మార్పులు జరిగాయి. ఈ సినిమాని కూడా నేటివిటీకి తగ్గట్టు మార్చాం. ఏదేమైనా కానీ తను ధనుష్, నేను వెంకటేష్. అక్కడ తను ఔట్‌‌‌‌స్టాండింగ్ పర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడ నేను నారప్ప ఎమోషన్స్‌‌‌‌ని చూపించాను.  నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ద బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చాను. అందరికీ 
  • నచ్చుతుందనుకుంటున్నాను.
  • శ్రీకాంత్ అడ్డాలతో గతంలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్​టైనర్ చేశాను. ఈ సబ్జెక్ట్ టోటల్​గా డిఫరెంట్.  అయినా దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. మణిశర్మ నా మొదటి సినిమా నుంచి కూడా మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు.  ఈ సినిమాకి కూడా చాలా మంచి స్కోర్ ఇచ్చాడు. 
  • ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. కానీ నేను ఏ సినిమా చేసినా షూటింగ్​ అయిపో
  • గానే ఆ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తాను. అందులోనే ఉండిపోడానికి నేనేమీ మెథడ్​ ఆర్టిస్ట్​ని కాను. ‘నారప్ప’ని అలాగే పూర్తి చేశాను. ‘దృశ్యం 2’ కూడా పూర్తయ్యింది. ‘ఎఫ్‌‌‌‌3’ షూటింగ్ దశలో ఉంది. బహుశా
  • సంక్రాంతికి రిలీజవుతుందేమో. ఇది   కంప్లీటయ్యాక కొన్ని రోజులు టూర్‌‌‌‌‌‌‌‌కి వెళ్దామనుకుంటున్నాను. తరుణ్ 
  • భాస్కర్‌‌‌‌‌‌‌‌తో ఓ స్పోర్ట్స్‌‌ బ్యాక్​డ్రాప్​ మూవీ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే కథ మీద వర్క్​ చేస్తున్నాం. ఎప్పటికి సెట్స్​కి తీసుకెళ్లాలనేది ఇంకా డిసైడవ్వలేదు. 
  • ఏజ్‌‌‌‌కి తగ్గట్టు కొత్త కథలు రావాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు అలాంటివి రావడం లేటవుతుంది. ఒక్కోసారి నాలుగైదు స్ర్కిప్టులు రెడీగా ఉంటాయి. కానీ ఏదీ ఓకే అవ్వదు. త్రివిక్రమ్ అయినా మరెవరైనా కథలు రావాలి, కాంబినేషన్స్ కుదరాలి. మన చేతిలో ఏదీ ఉండదు. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరిస్తూ మన పని మనం చేసుకుంటూ పోవడమే.  
  • నేను ఇప్పటికే చాలా రీమేక్స్​లో  నటించాను. చంటి, సుందరకాండ, గురు వంటి చాలా మూవీస్​కి మంచి అప్లాజ్ వచ్చింది. రీమేక్స్ ఎందుకు చేస్తారని చాలామంది అడుగుతారు. నిజానికి రీమేక్స్‌‌‌‌లో నటించడం అంత ఈజీ కాదు. అసలు రీమేక్ చేయడమే పెద్ద చాలెంజ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని మన నేటివిటీకి, వేరే యాక్టర్​ చేసిన పాత్రని మనం మన స్టైల్లోకి మార్చడం అంత తేలికేమీ కాదు.
  • కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఈసారి ప్రకృతి పిలుపు మామూలుగా లేదు. మంచైనా, చెడైనా మనం చేసినదానికి పర్యవసానం ఉంటుంది అంటారందుకే.  ప్రకృతి కరోనా రూపంలో విలయ తాండవం చేసింది. జనమంతా ‘మాకేం వద్దు.. ఆరోగ్యంగా ఉంటే చాలు’ అనుకున్నారు. అంతేకాదు.. కరోనా జనాల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. కానీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అవన్నీ మరచిపోతున్నాం. నిజానికి మన చేతుల్లో ఏదీ ఉండదు. జనాలకు లైఫ్‌‌‌‌ సీక్రెట్‌‌‌‌ తెలిసిపోయింది.