దృశ్యం 2 వచ్చేస్తోంది

V6 Velugu Posted on Sep 21, 2021

‘నారప్ప’ వచ్చి నాలుగు నెలలు దాటింది. వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ షూటింగ్‌‌లో బిజీగా ఉన్న వెంకటేష్, ఇప్పటికే ‘దృశ్యం 2’ కంప్లీట్ చేసేశారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో రిలీజయినప్పటికీ మొదటి భాగానికి మించిన ఆదరణ వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన జీతూ జోసెఫే తెలుగులోనూ డైరెక్ట్‌‌ చేయడంతో రీమేక్ పైనా అంచనాలు మరింత పెరిగాయి. నిన్న ఫస్ట్‌‌ లుక్ కూడా విడుదలవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోవైపు సెన్సార్ పూర్తయింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలో చెప్పనున్నారు. ఇదిలా ఉంటే మరో కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో వెంకటేష్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్​ డైరెక్షన్‌లో నటించనున్నాడట. ఎంతవరకూ నిజమో మరి!

Tagged sensor, Venkatesh, , Drishyam 2

Latest Videos

Subscribe Now

More News