వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కానుంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. ప్రభ, రామ్ మిరియాల పాడిన తీరు ఆకట్టుకుంది. డింపుల్ హయాతి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘దాదాపు 20 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ‘ఆదర్శ కుటుంబం’ మామూలు కుటుంబం కాదు.. వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు ఊహించని ట్విస్టులు ఉంటాయి’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణం వెంకటేష్‌తోనే ప్రారంభమైంది. ఆయనపై నాకు ఎప్పుడూ గౌరవంతో కూడిన అభిమానం ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత చినబాబు, మ్యూజిక్ డైరెర్టర్ తమన్, హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.
