వెంకీ కుడుముల నిర్మాతగా ఇట్లు అర్జున

వెంకీ కుడుముల నిర్మాతగా ఇట్లు అర్జున

ఛలో, భీష్మ, రాబిన్ హుడ్‌‌‌‌‌‌‌‌ లాంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న  వెంకీ కుడుముల, నిర్మాతగా కొత్త  క్రియేటివ్ జర్నీని ప్రారంభించాడు.  ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్’ పేరుతో కొత్త బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేసి.. తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు.  తను నిర్మించబోయే చిత్రంతో  అనిష్‌‌‌‌‌‌‌‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు.  అనస్వర రాజన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఆదివారం ఈ చిత్రానికి ‘ఇట్లు అర్జున’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తూ  ‘సోల్ ఆఫ్ అర్జున’ పేరుతో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు. 

హీరో నాగార్జున వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్..  ప్రేమలోని  స్వచ్ఛత, లోతును  గొప్పగా ఆవిష్కరించింది.  అర్జున మాట్లాడలేడు, కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు, అతని భావోద్వేగాలను తగ్గించదు. అతని ధైర్యం, బలం ఈ టీజర్‌‌‌‌‌‌‌‌లో ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది.  

నూతన దర్శకుడు మహేష్ ఉప్పల ఈ సినిమాకు  దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నాడు.