టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చారి 111(Chari 111). టీజీ కీర్తికుమార్(TG Keerthi kumar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించగా.. మురళీశర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో కనిపించారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మర్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది ఈ సినిమా.
దీంతో ఈ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్న క్రమంలో ఈ సినిమామీ ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏప్రిల్ 5 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో మూవీ లవర్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.