హైకోర్టులో మహిళా కమిషన్ Vs వేణుస్వామి వివాదం

హైకోర్టులో మహిళా కమిషన్ Vs వేణుస్వామి వివాదం


ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వివాదం హైకోర్టుకు చేరింది. ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాల విశ్లేషణలు చేస్తూ తరచుగా వివాదాల్లో నిలిచే వేణు స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు అందింది.  ఈ కంప్లయింట్​ను బేస్​ చేసుకుని  వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ  చేసింది.  ఈ నోటీసులను సవాల్​ చేస్తూ వేణు స్వామి హైకోర్టులో  మహిళా కమిషన్ పై పిటిషన్ వేశారు. 

వేణుస్వామి దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన హైకోర్టు .... స్వామికి నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి అర్హత ఉందని మహిళా కమిషన్ ను  హైకోర్టుప్రశ్నించింది. దీని పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ సమాధానంగా వేణు స్వామి జ్యోతిష్యాల పేరుతో అసత్య, మోసపూరిత వాక్యాలు చేస్తున్నాడని హైకోర్టుకు తెలిపారు.  జీపీ సమాధానం విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి ( ఆగస్టు 21) వాయిదా వేసింది.