అమెరికా లెజెండ్ వీనస్ విలియమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి

అమెరికా లెజెండ్ వీనస్ విలియమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగిన ఓల్డెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన 45 ఏండ్ల అమెరికా లెజెండ్ వీనస్ విలియమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన  విమెన్స్ సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో వీనస్ 7–-6(7/5), 3–-6, 4–-6తో ఓల్గా డానిలోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెర్బియా)   చేతిలో ఓడింది. తొలి సెట్ నెగ్గి, మూడో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4–-0 తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, వరుసగా 6 గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కోల్పోయి పరాజయం పాలైంది. 

మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ అరీనా సబలెంకా 6–-4, 6–-1తో ఫ్రాన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తియెంట్సోవా రాజావోనాపై ఈజీగా గెలిచింది. మెన్స్‌‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్ వేటను విజయంతో మొదలుపెట్టాడు. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్ సీడ్ కార్లోస్ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–-3, 7–-6(7/2), 6–-2 తో  ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ వాల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వరుస సెట్లలో గెలుపొందాడు. మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-–7(7/1), 6–-1, 6–-4, 6–-2తో డియల్లో ( కెనడా)పై పోరాడి నెగ్గాడు.